Ajit Doval: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పుతిన్‌తో దోవల్ కరచాలనం చేసిన చిత్రాలను భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ఉక్రెయిన్‌లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసిన రెండు వారాల తర్వాత అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై నియంత్రణ కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తాగు నీరు, కరెంట్, ఇతర మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్ పట్టణాలపై విరుచుకుపడుతోంది. మిలియన్ల మంది తాగునీరు, కరెంట్ లేకుండా అల్లాడుతున్నారు. రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, ఒడెసా నగరాలపై రష్యా దాడులు చేసింది. దీంతో ఆయా నగరాల్లో విద్యుత్ స్తంభించిపోయింది. కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కీ…
Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.