London Protests 2025: నేపాల్ నిరసనల నుంచి ప్రపంచం దృష్టి ఒక్కసారిగా లండన్ వైపు మళ్లింది. ఎందుకంటే ఇటీవల లండన్ వీధుల్లోకి వేలాది మంది బ్రిటన్ పౌరులు వచ్చి నిరసనలు తెలపడం దీనికి కారణం. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుందని ఆందోళనగా చూస్తున్నాయి. లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా.. ఎందుకని అక్కడి పౌరులు లెబనాన్‌తో బ్రిటన్‌ను పోల్చుతున్నారు.. ఇంతకీ బ్రిటన్ నిరసనలకు అసలు కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..…
Elon Musk: లండన్‌లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరుగుతున్న ‘‘వలసల వ్యతిరేక’’ ఆందోళనలు మిన్నంటాయి. లక్షకు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చ్ చేశారు. ‘‘యునైట్ ది కింగ్‌డమ్’’ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగిస్తూ , సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మస్క్ పిలుపునిచ్చారు.
London: నేపాల్ హింసాత్మక ఘటనల తర్వాత పలు దేశాల్లో అనేక విషయాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా యూకే రాజధాని లండన్‌లో భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూకే చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. వలసకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు మార్చ్ చేశారు. ఈ ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.