London Protests 2025: నేపాల్ నిరసనల నుంచి ప్రపంచం దృష్టి ఒక్కసారిగా లండన్ వైపు మళ్లింది. ఎందుకంటే ఇటీవల లండన్ వీధుల్లోకి వేలాది మంది బ్రిటన్ పౌరులు వచ్చి నిరసనలు తెలపడం దీనికి కారణం. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుందని ఆందోళనగా చూస్తున్నాయి. లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా.. ఎందుకని అక్కడి పౌరులు లెబనాన్‌తో బ్రిటన్‌ను పోల్చుతున్నారు.. ఇంతకీ బ్రిటన్ నిరసనలకు అసలు కారణం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Telangana : మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు ఆడొద్దు” గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
భయం నీడలో బ్రిటన్..
నేడు బ్రిటన్ తెలియని భయం నీడలో జీవిస్తోంది. అక్కడి స్థానికులు బానిసలుగా మారడానికి భయపడుతున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న వలసదారుల సంఖ్య తమ స్వేచ్ఛను హరిస్తోందని బ్రిటన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా లక్షలాది మంది బ్రిటన్ పౌరులు లండన్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పెరుగుతున్న వలసదారుల సంఖ్యకు వ్యతిరేకంగా లండన్ వీధుల్లో యునైట్ ది కింగ్‌డమ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ఆగ్రహానికి కారణం బ్రిటన్‌లో స్థానిక పౌరుల సంఖ్య తగ్గడమే అని పలు నివేదికలు చెబుతున్నాయి. పలు నివేదిక ప్రకారం.. ప్రస్తుతం బ్రిటన్ జనాభాలో 73 శాతం మంది స్థానిక బ్రిటిష్ పౌరులు ఉన్నారు. వీరు 2050 నాటికి 57 శాతానికి తగ్గనున్నారు. ఈ నివేదికల ప్రకారం 2063 నాటికి బ్రిటన్ స్థానికులు తమ సొంత దేశంలో మైనారిటీ కానున్నారు. ఎందుకంటే అప్పుడు వారి జనాభా 50% కంటే తక్కువగా ఉంటుంది. నేడు బ్రిటన్ లెబనాన్ లాంటి పరిస్థితిని తమ దేశంలో వస్తుందని భయపడుతుంది. లెబనాన్‌లో ఒకప్పుడు క్రైస్తవులు మెజారిటీగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్లు తమ సొంత దేశంలో మైనారిటీగా మారారు. ఈ పశ్చిమాసియా దేశంలో ఇప్పుడు మెజారిటీగా ముస్లింలు మారారు.
లెబనాన్‌లో మెజారిటీగా ముస్లింలు..
పశ్చిమాసియాలో ఒక చిన్న దేశం లెబనాన్. 1970లలో ఇజ్రాయెల్ తర్వాత ఈ ప్రాంతంలో ముస్లింయేతర మెజారిటీ దేశం ఇదే. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. పలువురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రజాస్వామ్యమే ముస్లింలు లెబనాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి దారితీసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని సాంస్కృతిక వైవిధ్యం అద్భుతమైనది. ఇది మెరోనైట్ క్రైస్తవులకు ఏకైక నివాసం. ఆసియాలో మిగిలి ఉన్న చివరి గ్రీకు కాథలిక్కులకు కూడా లెబనాన్ నిలయంగా ఉండేది. లెబనాన్‌కు స్వతంత్రం వచ్చిన తర్వాత పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాలు దానిపై దాడి చేసి.. అక్కడి జనాభాను ఇస్లాంలోకి మార్చి ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్రణాళిక వేసాయి.
నగరాల ఆక్రమణతో పథకం ప్రారంభం..
1971 నాటికి లెబనాన్‌లో క్రైస్తవులు 52-54% ఉన్నారు. మెల్లమెల్లగా ఈ దేశం ముస్లిం శరణార్థులతో ఆక్రమించబడింది. ముస్లింలు ఒకటి తర్వాత ఒకటిగా నగరాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. మొదట పశ్చిమ బీరుట్, తరువాత సిడాన్, తరువాత టైర్. ఇప్పుడు ఈ పురాతన క్రైస్తవ నగరాలు పూర్తిగా ఇస్లామిక్‌గా మారాయి. అప్పుడు దేశంలో ముస్లింల జనాభా దాదాపు 44% అయ్యింది. తరువాత వారు 1991 వరకు కొనసాగిన అంతర్యుద్ధాన్ని ప్రారంభించారు. అది ముగిసే సమయానికి పరిస్థితి తారుమారైంది. ముస్లింలు మెజారిటీగా మారి క్రైస్తవులు మైనారిటీగా అయ్యారు. ప్రతి ఏడాది క్రైస్తవులు అమెరికాకు వలస వెళుతున్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ దేశంలో ప్రతి ఏడాది క్రైస్తవుల సంఖ్య మరింత దిగజారుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
1975 నుంచి 1990 వరకు అధికారం, ఆధిపత్యం కోసం జరిగిన అంతర్యుద్ధం లెబనాన్‌ను పూర్తిగా మార్చివేసింది. క్రైస్తవ, ముస్లింల ఆధిపత్యం కోసం జరిగిన ఈ అంతర్యుద్ధంలో లక్ష మంది క్రైస్తవులు చంపబడ్డారు, సుమారు 10 లక్షల మంది క్రైస్తవులు దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లెబనాన్‌లో క్రైస్తవుల సంఖ్య దాదాపు 15 శాతం ఉంది. నేడు లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు బలమైన కోటగా మారిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Team India Jersey Sponsor: టీం ఇండియాకు నయా స్పాన్సర్.. ఒక్క మ్యాచ్‌కు ఎన్ని కోట్లు అంటే?