దేశంలో వివాదాస్పదం అయిన హిజాబ్ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. వచ్చే వారం నుంచి దీనిపై విచారణ చేపడుతామని, వచ్చేవారం లిస్ట్ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కర్ణాటక హైకోర్టు, స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో సుప్రీం…