మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది.…