India vs Ban: జింబాబ్వేలోని బులేవాయో వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీం తమీమ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టు పగ్గాలు…