బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.