హైస్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు.
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు.
బ్లాక్ మాస్క్‌లు ధరించి ఫొటోలు దిగినందుకు ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు విద్యార్థులు తమ స్నేహితుడి కోసం మాస్క్‌లు ధరించినందుకు పాఠశాల నుండి బహిష్కరించబడ్డారు. ఇందుకు సంబంధించిన జరిగిన కేసులో ప్రతి విద్యార్థికి 8.2 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ముందుగా ఈ విషయంపై ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలిఫోర్నియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలపై దావా వేశారు. 2017లో, యువకులు మొటిమల చికిత్సకు మాస్క్‌లను…
కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
అమెరికాలోని అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా.. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతులు నివేష్ ముక్కా (19), గౌతమ్ పార్సీ…
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.