లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.