అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో పార్క్ చేసిన విమానాన్ని మరో చిన్న విమానం ఢీకొట్టింది. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఫ్రాన్స్‌లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఫ్రెంచ్ వైమానికి దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు.