లక్నోలో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని గోసాయిగంజ్‌లో స్నానం చేస్తుండగా ముగ్గురు పిల్లలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సాలెంపూర్‌లోని మజ్రా లోధ్ పూర్వా గుండా ప్రవహించే లోనీ నదిలో ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు నదిలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు పిల్లలు నీటిలో కొట్టుకుని పోయారు. వెంటనే ఘటనా స్థలానికి తహసీల్దార్ గోసైన్‌గంజ్ గుర్‌ప్రీత్ సింగ్, పోలీసులు చేరుకున్నారు. లోధ్ పూర్వ నివాసి అయిన గుడ్డు అనే కార్మికుడు శుక్రవారం…
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
జమ్మూలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.