Twitter Logo: ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ట్విట్టర్ లోగోగా ఉన్న పిట్టను తొలగించి.. Xను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వెబ్‌సైట్‌ను కూడా X.com మార్చారు.
ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.
ట్విట్టర్ లోగోను మరో సారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూ బర్డ్ లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు సంబంధించిన ‘డోజీ’ మీమ్‌నుట్విట్టర్ లోగోగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.