తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. దాంతో విజయ్ కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు…
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకుంది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40కి పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా…
తమిళ స్టార్ హీరో నటిస్తున్న చివరి సినిమా జననాయగాన్. విజయ్ కెరీర్ లో 69వ గా రాబోతున్నఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమలు బ్యూటీ మమతా బైజు విజయ్ కు కూతురిగా నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ పై…
నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.