తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి. ఈ పేరుకంటే జగ్గారెడ్డిగానే అందరికీ పరిచయం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కొద్దిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే కయ్ మంటున్నారు. ఇటీవల పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా.. గోడకేసి కొడతానని రేవంత్ అనడంతో.. అంతే స్థాయిలో భగ్గుమన్నారు జగ్గారెడ్డి. గోడకేసి కొట్టడానికి నువ్వెవడివి అని నేరుగానే రేవంత్‌కు గురిపెట్టారు. ఆ వివాదం కాంగ్రెస్ పొలిటికల్ టెంపరేచర్‌ను అమాంతం పెంచేసింది. చివరకు వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి…