Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ... ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్‌కేసర్ పరిధిలోని ఔషపూర్‌లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.