Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.