గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. తురకపాలెం మెడికల్ క్యాంప్‌కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు...
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు నెలల్లో 30మంది మృతిచెందారు. దీంతో వైద్యారోగ్య శాఖ వరుస మరణాలపై దృష్టి పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఎపిడిమిక్ బృందంతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్.పి.ఎం., మైక్రో బయాలజీ వైద్యబృందం పర్యటిస్తోంది. మృతుల కుటుంబాలనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మరణాలకు దోమకాటా… లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ శాంపిల్స్, నీటి పరీక్షల ఫలితాలు…