Nara Lokesh: తుని రూరల్ గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలియడంతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన స్పందిస్తూ.. జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అమానుష ఘటనలకు పాల్పడే వ్యక్తులెవరైనా సరే ఉక్కుపాదంతో అణచివేస్తామని…