Tummala Nageswara Rao : ఖానాపురం హవేలీ నాల్గవ డివిజన్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (జి+1 భవనం) పనులకు సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, “ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలకు సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం”…
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
మహిళా జర్నలిస్టుతో సీపీఎం నేత పాడుబుద్ధి.. ఎఫ్ఐఆర్ నమోదు ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో సీపీఎం పార్టీ సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేసింది. తాజాగా అతగాడిపై పోలీసులు కూడా కేసు నమోదు…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు…
హమాస్ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్.. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్12 న్యూస్ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర…
ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కన్నెర్ర చేశారు. అధికారుల అలసత్వం మిల్లర్లు ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం అక్రమార్కుల చేతిలో కి వెళ్లడం పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపు పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ధాన్యం పక్కదారి పట్టడానికి కారకులను…
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్…
తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా..…