జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఇవాళ(మార్చి 23) పర్యాటకుల కోసం తెరుచుకుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు.
జమ్ము కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చ్ 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు.