Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది.