Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు.