Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమిళనాడు రాజకీయాల్లో దివంగత నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆమె కన్నుమూసిన తర్వాత కీలకంగా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత జైలు పాలయ్యారు.. అయితే, మళ్లీ చక్రం తిప్పింది చిన్నమ్మగా పిలుచుకునే శశికళ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. ఇప్పుడు శశికళ టీమ్‌తో కలసి పనిచేయడానికి సై అంటున్నారు.. ఈ రోజు అడియార్‌లోని టీటీవీ దినకర్ ఇంటిలో ఆయనతో సమావేశం అయ్యారు…
తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఎప్పుడు చక్రం తిప్పుదామని ప్రయత్నాలు చేసినా.. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. జయలలిత నిచ్చెళిగా గుర్తింపు పొందిన ఆమె.. జయ కన్నుమూసిన తర్వాత.. అన్నా డీఎంకేలో కీలక బాధ్యతలు చేపట్టారు.. క్రమంగా సీఎం చైర్ ఎక్కాలని ప్రయత్నాలు చేసినా.. కేసుల్లో ఇరుక్కుపోయి జైలుపాలయ్యారు.. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన ఆమెకు తమిళనాడులో భారీ స్వాగతమే లభించింది.. తన కారులో జయలలిత ఫొటో పెట్టుకుని దర్శనమిచ్చారు. ఎన్నికల ముందు…