ప్రకృతి వైపరీత్యాలకు జపాన్ పెట్టింది పేరు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు తుపానులు ఆ దేశాన్నిఅతలాకుతలం చేస్తూ ఉంటాయి. తాజాగా జపాన్ కు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పపువా న్యూ గినియా దీవుల్లో పేలిన ఓ అగ్ని పర్వతం కారణంగా జపాన్ కు సునామీ ముంపు తప్పేటట్లు కనిపించడం లేదు.