తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లతో ప్రయాణికుల మనస్సులను గెలుచుకుంటోంది. ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం…
రంజాన్ సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీని గాడిన పెట్టేపనిలో భాగంగా ఎండీ సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు.ప్రతీ పండగ సందర్భంగా కొత్త కొత్త డిస్కౌంట్లను ఆయన ప్రవేశపెడుతున్నారు. తాజాగా రంజాన్ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీకి సంబంధించిన కార్గో, పార్శిల్ ఛార్జీలపై 25శాతం తగ్గింపు…