Tspsc paper leak case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్ ఘటనపై నిరుద్యోగులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
TSPSC: టీఎస్ పీ ఎస్ సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ ల సంఖ్య 74 కు చేరింది. నిందితుడు పొల రమేష్.. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా సిట్ గుర్తించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు 13 మందిని సిట్ అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ బావ ప్రశాంత్ ను సిట్ అరెస్టు చేశారు. గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రశాంత్ కి వందకు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ విచారణలో వెల్లడి కావడంతో ప్రశాంత్ ను అదుపులో తీసుకున్నారు.
సిట్ కార్యాలయం వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ 11 గంటలకు సిట్ ఎదుట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. పేపర్ లీక్ పై తన ఆరోపణల పట్ల ఆధారాలను సమర్పించాలని రేవంత్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.