Chiranjeevi: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది.