Chiranjeevi: బూతుల రాజకీయాలు నా వల్ల కాలేదు.. అందుకే బయటకు వచ్చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదును వారికి అందజేశారు.
ఇక ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అవార్డులను కోరుకోనని, ప్రజల గుండెల్లో తనపై ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదని చిరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ పట్ల తనకు అత్యంత గౌరం వుందని, కళను గుర్తించి అవార్డులు ఇస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక చివర్లో చిరు.. తానెందుకు రాజకీయాల నుంచి దూరమయ్యారో వివరించారు. ప్రస్తుత రాజకీయాలు.. ఆరోగ్యకరంగా లేవని, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి కానీ, ఇప్పుడు ఎవరు అలా ఉండడం లేదని అన్నారు. ఇప్పుడు అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని, ఆ వ్యక్తిగత విమర్శలను తట్టుకోలేకనే తాను రాజకీయాల్లో నుంచి బయటికి రావాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను తిప్పికొడితేనే రాజకీయాల్లో ఉండగలిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?