తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయిన మేము హైకోర్టు కి వెళ్ళామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. సస్పెండ్ కి కారణాలు ఏంటి అని రాత పూర్వకంగా హామీ ఆడిగాం ఇంత వరకు ఇవ్వలేదని, స్పీకర్ ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆరోజు బయటకు పంపించారన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసులు ఇవ్వండి అని హైకోర్టు చెప్పిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి…