Donald Trump: యూరప్ దేశాల్లోకి ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వలసలు యూరప్‌ని చంపేస్తున్నాయి’’ అంటూ శనివారం ఆయన వ్యాఖ్యానించారు. వలసల్ని నిరోధించడానికి కలిసి రావాలని అన్నారు. స్కాట్లాండ్‌లో పర్యటనలో ఉన్న ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా యూరోపియన్ దేశాలు ‘‘భయంకరమైన దండయాత్ర’’లను ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు.