Trump Tower: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. తన తొలిరోజు రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అమెరికా-ఇండియాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ భారత్‌కి సన్నిహితుడనే పేరుంది. మోడీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఇరు దేశాల కీలక ఒప్పందాలకు కారణమవుతుందని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.