అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీపై ఎన్నో అంచనాలు.. ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఇద్దరి సమావేశం తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూసింది. కానీ చివరికి ఇద్దరి భేటీ ‘తుస్’ మనిపోయింది.
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చెప్పారు.