గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హమాస్‌కు ‘తుది హెచ్చరిక’ జారీ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రాసుకొచ్చారు. ‘ షరతులను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇక మరో అవకాశం ఉండదు!’…