Trump Tariffs - Operation Sindoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరిపై అగ్రశ్రేణి నిపుణులు సైతం మండిపడుతున్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌ను, అమెరికాకు ప్రథమ శత్రువుగా పరిగణించే చైనాను అకస్మాత్తుగా ట్రంప్ ఇష్టపడుతున్నారు. సుంకాల వివాదంలో చైనా కూడా భారతదేశానికి నైతిక మద్దతు ఇస్తుంటే.. ట్రంప్ మాత్రం మిత్రదేశం అంటూనే దెబ్బమీద దెబ్బ తీస్తున్నారు. భారత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఆపరేషన్ సిందూర్ అని ఓ విశ్లేషకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.