H-1B visa: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.