H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.