Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై సుంకాలు విధించారు. మరోవైపు అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలు విధించే, దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా కెనడాపై మరోసారి టారిఫ్స్‌తో విరుచుకుపడింది.