రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళిక రచించారు. ఈ ప్రణాళికపై గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధికారులు చర్చించారు. వారం రోజుల్లో ప్రణాళికను అంగీకరించాల్సిందేనని అల్టిమేటం విధించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య మొదలైన యుద్ధాలన్నీ శాంతించాయి. దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాలు కూడా ముగిశాయి. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇంకా ముగియలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించారు.