ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు