పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ? అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్‌ఎస్ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి…