తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న…