తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా అభ్యర్థుల ప్రకటన రానుంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి ఖాళీ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు రేపు ఆఖరు తేదీ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఫరీ దుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, బొడకుంట వెంకటేశ్వర్లు, నేతి విద్యా సాగర్ కు పదవీ కాలం ముగిసింది.…