గోల్డ్‌కోస్ట్ వేదికగా నవంబర్ 6న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను ఆసీస్ జట్టు నుంచి రిలీజ్ చేశారు. 2025 షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సీఏ ఆదేశించింది. రొటేషన్‌లో భాగంగా చివరి రెండు టీ20లకు విశ్రాంతిని ఇచ్చారు. అంతేకాదు 2025 యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా సీఏ ఈ నిర్ణయం…