IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.