Story Board: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు బలి తీసుకుంది. జరిగిన ఘటనను విశ్లేషిస్తే.. ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్,ఆర్టీఏ అధికారులు.. ఇలా అన్నివైపుల నుంచీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. డ్రైవర్లు ప్రమాద సమయంలో నిద్రమత్తులో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయం అలాంటిది. సహజంగా ఆ సమయంలో నిద్రవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం. హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన…