అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసీసీ తెలిపింది.