ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.