Bangladesh: బంగ్లాదేశ్ దూకుడుకు భారత్ కళ్లెం వేస్తోంది. ఇటీవల చైనా పర్యటనలో ఆ దేశ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ మాట్లాడుతూ.. భారత్ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్‌గా ఉన్నాయని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడిని, చైనా తమ దేశం ద్వారా ఆ ప్రాంతానికి విస్తరించవచ్చని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ సీరియస్‌గా తీసుకుంటోంది. చైనా పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో, పరోక్షంగా భారత్‌ని దెబ్బతీసే ప్రయత్నంలో బంగ్లాదేశ్ ఉందని భారత అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు…