గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. మరొక పైలట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్‌నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్త గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.