పాకిస్తాన్ లో గత కొన్ని రోజుల క్రితం రైలు హైజాక్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణిస్తుండగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. అయితే ఈ ఘటనపై తమ దేశంలో జరుగుతున్న హింసకు భారతదేశమే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. పాక్ మరోసారి భారత్ పై విషం చిమ్మింది. పాక్ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పిందించింది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణకు సంబంధించి…